»Mirzapur Loot Case Robbery From Cash Delivery Vehicle Outside Axis Bank Guard Shot
CCTV : మిర్జాపూర్ గార్డును తుపాకీ తో కాల్చి.. బ్యాంకు డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ వెలుపల దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పట్టపగలు నగదు పంపిణీ వాహనం గార్డును కాల్చిన ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డయింది.
CCTV : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ వెలుపల దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పట్టపగలు నగదు పంపిణీ వాహనం గార్డును కాల్చిన ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగులు గార్డుతో పాటు మరొకరిపై కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం డబ్బుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఉన్నాయి. దాదాపు అరడజనుకు పైగా ద్విచక్రవాహనాలపై దుండగులు వచ్చారు. దోపిడీ అనంతరం మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరుపుతూ పారిపోయారు.
ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులు బ్యాంకు నుంచి డబ్బా నిండా నగదు తీసుకొచ్చి వ్యాన్‌లో ఉంచుతున్నారు. ఇంతలో రెండు బైక్‌లపై నలుగురు వ్యక్తులు వ్యాన్ దగ్గరకు చేరుకున్నారు. నలుగురూ హెల్మెట్ ధరించి ఉన్నారు. బైక్‌పై వెనుక కూర్చున్న దుండగుల రెండు చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. బైక్ ఆగిన వెంటనే నలుగురూ దిగి గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
मिर्जापुर में बड़ी वारदात। एक्सिस बैंक के गार्ड और कैशियर समेत 3 को गोली मारी। 22 लाख रुपए से भरा बक्सा लेकर भागे बदमाश। pic.twitter.com/MYYOccOlWb
బైక్‌పై నుంచి దిగిన తర్వాత అగంతకులు క్యాష్ డెలివరీ వాహనం దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి గార్డును కాల్చిచంపడం సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఆ తర్వాత క్యాష్ డెలివరీ వాహనంలో ఉన్న ఇతరులపై కూడా కాల్పులు జరిపి బ్యాగ్ నిండా డబ్బు తీసుకుని పారిపోయాడు. ఈ సమయంలో గార్డు కూడా లేచి నిలబడటానికి ప్రయత్నించాడు. కానీ అతను నేలపై పడిపోతాడు. అంతే కాదు ఈ సమయంలో పరుగున అక్కడికి చేరుకున్న వ్యక్తి అగంతకుల భయంతో పక్కకు తప్పుకుంటాడు. ఇంతలో మెల్లగా జనం గుమికూడటం మొదలు పెట్టారు. ప్రజలు గార్డును రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికి దుండగులు అక్కడినుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.