Food: ఇవి రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!
పేస్ట్రీ, కేకు, చీజ్, చిప్స్, కుకీ, చిప్స్, పానీయాలు రెగ్యులర్‌గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ రోజు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Food: క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలను మనం రోజూ తీసుకుంటున్నాం. ఆల్కహాల్, పొగాకు , సిగరెట్లతోపాటు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అనేక ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలు బరువు పెరగడమే కాకుండా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఈ ఆహారాల గురించి తెలుసుకుందాం…
ప్రాసెస్డ్ ఫుడ్ లేదా రెడీమేడ్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం అని భావిస్తారు. అవి బరువును పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా దెబ్బతీస్తాయి. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఆహారాలలో చాలా వరకు కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ , సోడియం ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు , క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. క్యాన్సర్‌కు ఆల్కహాల్, పొగాకు , సిగరెట్లు మాత్రమే కారణం అని ప్రజలు అనుకుంటారు. ప్రతి రోజూ తినే కొన్ని పదార్థాలు క్యాన్సర్ కారకాలను కలిగి ఉంటాయి.
చదవండి: Health tips: ఈ ఫుడ్స్ తీసుకుంటే డెంగ్యూ మీ దరి చేరదు!
కృత్రిమ రంగులు
పేస్ట్రీలు, కేకులు, చీజ్, చిప్స్, కుకీలు, పసుపు పానీయాలలో కృత్రిమ రంగులను ఉపయోగిస్తారు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వాడకం వల్ల కిడ్నీలు, పేగుల్లో ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉందని క్యాన్సర్ పై పరిశోధనలో వెల్లడైంది.
కూరగాయల నూనె వెజిటబుల్
కనోలా, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశెనగ, బెనోలా, తాటి గింజలు, సోయాబీన్ మొదలైనవి చాలా ఆహార పదార్థాలలో కనిపిస్తాయి. అవి శరీరానికి హానికరం. వాటిలో ఒమేగా-6 పుష్కలంగా ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాలను ప్రోత్సహిస్తుంది, రక్తం గడ్డకట్టడం, శరీరంలో మంటను ప్రోత్సహిస్తుంది.
ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేయబడిన మాంసాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలలో సోడియం ఉపయోగిస్తారు. సోడియం సోడియం నైట్రేట్‌గా తయారవుతుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కృత్రిమ చక్కెర
చాలా మంది షుగర్‌ని నియంత్రించడానికి కృత్రిమ చక్కెరను ఉపయోగిస్తారు. కృత్రిమ చక్కెర ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. సుక్రోలోజ్ సోడా, స్వీటెనర్లు మరియు ఎనర్జీ డ్రింక్స్‌లో లభిస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఫాస్ట్ ఫుడ్ లేదా పిజ్జా, బర్గర్లు, పాస్తా మొదలైన జంక్ ఫుడ్స్‌లో థాలేట్ కనిపిస్తాయి. ఇవి ప్లాస్టిక్ పదార్థాలను అనువైనవిగా చేస్తాయి. దీని వినియోగం వల్ల క్యాన్సర్, సంతానలేమి, కాలేయం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.