»Several Trains Diverted From September 25 To 29 As Part Of Maintenance Work At Secunderabad
South Central Railway: 4 రోజులు సికింద్రాబాద్కు పలు ట్రైన్స్ బంద్!
సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు గమనిక. ఎందుకంటే సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు ట్రైన్స్ అందుబాటులో ఉండవని అధికారులు ప్రకటించారు. ఆ నాలుగు రోజులు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Several trains have been canceled in Kazipet-Vijayawada route till the december 18th
South Central Railway: దేశంలో రవాణా వ్యవస్థలో రైల్వే(Railway)కు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రైన్ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ దీన్నే ఎంచుకుంటారు. అయితే సికింద్రాబాద్(Secunderabad ) స్టేషన్ నుంచి ప్రయాణం చేసే వారికి ముఖ్య గమనిక. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైనులో నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంగా సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి, గాంధీ ధామ్ రైళ్లను వయా విజయనగరం, రాయపూర్, నాగపూర్ మీదుగా నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లింపులో భాగంగా విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ (20805), న్యూఢిల్లీ -విశాఖ (20806) ఏపీ ఎక్స్ప్రెస్ మార్గంలో దారి మళ్లిస్తారు. సెప్టెంబర్ 14, 21 తేదీల్లో విశాఖ-గాంధీ ధాం ఎక్స్ప్రెస్ (20803), సెప్టెంబర్ 24న గాంధీ ధాం-విశాఖ ఎక్స్ప్రెస్ (20804) నడుస్తుంది. సెప్టెంబర్ 22, 25 తేదీల్లో విశాఖ-నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ (12803) నడువనుంది. సెప్టెంబర్ 20, 24 తేదీల్లో నిజాముద్దీన్-విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ (12804) రైళ్లు వయా విజయనగరం, నాగపూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. అదే విధంగా పూరి-వోకా ఎక్స్ప్రెస్ (20819) సెప్టెంబర్ 24న వయా విజయనగరం, నాగపూర్ మీదుగా నడుస్తుంది. వీటిని గమనించుకుని ప్రయాణికులు తగు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచించారు.