హోంగార్డు రవీందర్ (Ravinder) మృతిపై ఆయన భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తపై ASI నర్సింగ్‌రావు, కానిస్టేబులు చందు,పెట్రోలు పోసి తగలబెట్టారని ఆమె ఆరోపించారు.ఈ ఘటన సంబంధించిన సీసీపుటేజ్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.రవీందర్ ఫోన్‌ను అన్ లాక్ (Unlock) చేసి డేటా డిలీట్ చేశారని సంధ్య తెలిపింది. నర్సింగ్‌రావు, చందును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తన భర్తతో మాట్లాడాకే చంపేశారని ఘటనపై కారణమైన వారిని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.హోంగార్డు (Home guard) రవీందర్ భార్యతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు.
ఆయన మృతదేహానికి (Dead body)పోస్టుమార్టం చేయడానికి కుటుంబసభ్యుల సంతకం తప్పనిసరి. అయితే సంతకం చేయడానికి ఆమె నిరాకరిస్తుండటంతో.. పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. తన భర్త చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ భార్య డిమాండ్ చేస్తున్నారు. రవీందర్ మృతిపై ఆయన కుటుంబంతో పాటు హోంగార్డులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో హోంగార్డుల అందరి పరిస్థితి దయనీయంగానే ఉందని వాపోతున్నారు. రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, హోంగార్డు ఆత్మహత్య (Suicide)పై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హోంగార్డు రవీందర్ చనిపోవడం బాధాకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)పేర్కొన్నారు. రవీందర్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. హోంగార్డు కుటుంబానికి ప్రభుత్వం (Govermemt) న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పాతబస్తీలోని ఉప్పుగూడ (Uppuguda) కు చెందిన రవీందర్.. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. సమయానికి శాలరీ రావడం లేదనే మనస్తాపంతో హోంగార్డు హెడ్ ఆఫీస్ ముందు ఈ నెల 5న ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు గుర్తించి రవీందర్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కంచన్ బాగ్ అపోలో డీఆర్డీఓ ఆస్పత్రి(DRDO Hospital)కి తరలించారు. కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌ను కొద్దిరోజులుగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌గా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడిన రవీందర్.. శుక్రవారం ఉదయం మృతి చెందాడు..