మహారాష్ట్రం(Maharashtra)లో ఆసక్తికర ఘటన జరిగింది. రెవన్యూ మంత్రి రాధాకృష్ణ (Minister Radhakrishna) విఖే పాటిల్‌పై ఓ వ్యక్తి పసుపు పౌడర్ చల్లాడు.ధంగర్ (Dhangar) (గొల్ల) వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తు ఇద్దరు వ్యక్తులు మంత్రిని కలిశారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. శేఖర్ భంగలే (Shekhar Bhangale) అనే వ్యక్తి తన జేబులో ఉన్న పసుపు (Haldi) ను తీసి మంత్రి తలపై చల్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆయన సిబ్బంది.. అతన్ని లాగేసి పంచ్‌లు విసిరారు. సోలాపూర్ (Solapur) జిల్లాలో ఉన్న ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ వర్గ సమస్యలపై ప్రభుత్వ దృష్టి పడాలన్న ఉద్దేశంతో మంత్రిపై హల్దీ వేసినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ధంగర్ల కులాన్ని ఎస్టీలో చేర్చి రిజర్వేషన్ (Reservation) కల్పించాలని డిమాండ్ చేశాడు. తమ డిమాండ్లను పట్టించుకోకుంటే, సీఎంపైనా, ఇతర మంత్రులపైనా నల్ల రంగు చల్లుతామని ఆ వ్యక్తి హెచ్చరించాడు. శేఖర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని మంత్రి ఆదేశించారు. పసుపు చల్లడాన్ని తప్పుగా తీసుకోవడం లేదని, పసుపును అన్ని పండుగల్లో వాడుతామని, శుభంగా భావిస్తామన్నారు. ఆ వ్యక్తి వెంటపడవద్దు అని పార్టీ కార్యకర్తలకు కూడా సూచించినట్లు మంత్రి వెల్లడించారు