»Mahesh Babus Reaction On Shahrukh Khans Jawan Collections
Mahesh Babu: జవాన్ కలెక్షన్లపై మహేష్ రియాక్షన్!
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ స్పందించారు. దీంతో ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mahesh Babu's Reaction on Shahrukh Khan's Jawan Collections
Mahesh Babu: ఇప్పుడంతా పాన్ ఇండియా(PanIndia) సినిమాల జాతర నడుస్తుంది. ఈ తరుణంలో బడా హీరోల సినిమాలకు మరో స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యే పాఠాన్(Pathan) సినిమాతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన షారూఖ్ ఖాన్(Sharukh khan) లేటెస్ట్గా జవాన్(Jawan) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రంపై పలువురు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తాజాగా జవాన్(Jawan) సినిమాను చూశారని. దీనిపై ఆయన ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. జవాన్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ అని షారుక్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
జవాన్..బ్లాక్ బస్టర్ సినిమా..కింగ్ నుంచి కింగ్ సైజు వినోదాన్ని డైరెక్టర్ అట్లీ అందించారు. షారూఖ్ కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రం అని వెండితెరపై ఆయన తేజస్సు, యాక్టింగ్ ఎంతో ప్రత్యేకం. జవాన్ చిత్రంతో తన రికార్డులను తానే బ్రేక్ చేస్తుందని, ఆయన లెజెండ్లా ఎంతో కూల్‌గా కనిపించారని అని మహేశ్ బాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే మహేష్ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏదైనా ఉందా అనే కోణంలో విశ్లేషకులు చూస్తున్నారు. మాములుగానే మహేష్ సినిమాలు విపరీతంగా చూస్తారని ఆయనే గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. అలాగే సినిమా బాగుంటే జన్యున్‌గానే స్పందిస్తారు.
ఆ మధ్య ఓ చిన్న సినిమా మేమ్ ఫేమస్(Mem Famous) సినిమా విషయంలో కూడా ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నారు. ఈ తరుణంలో అన్ని పరిశ్రమల హీరోల సినిమాలపై పాజిటీవ్‌గా స్పందిస్తే భవిష్యత్తులో తనకు కూడా కలిసొస్తుందని భావించి, మహేష్ ఇలా స్పందించారా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక హీరో నటించిన చిత్రాన్ని మరో హీరో పొగడడం అనేది మంచి పరిణామమేనని నెటిజన్లు అంటున్నారు.
అట్లీ(Atlee) కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఉంటుంది. ఈ సినిమాలో షారూక్ రెండు పాత్రలను పోషించారు. నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో నటించి జవాన్ మొదటి రోజే రూ.152 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదే స్పీడ్‌లో దూసుకెళ్తే త్వరలోనే పఠాన్ రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది.
#Jawan… Blockbuster cinema… 💥💥💥 @Atlee_dir delivers king size entertainment with the King himself!! Comes up with his career's best film… 👏👏👏 The aura, charisma and screen presence of @iamsrk are unmatched… He’s on fire here 🔥🔥🔥!! Jawan will break his own records……