Sanatana dharma: అసలు సనాతన హైందవ ధర్మం అంటే ఏమిటి?
ఇటివల తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది ఏ కాలంలో వచ్చింది. దీనిని ఎప్పటి నుంచి ప్రజలు ఆచరిస్తున్నారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
సనాతన ధర్మం(హిందు ధర్మం)..స్వర్గం లేదా నరకం అనే విశ్వాసం మీద ఆధారపడిలేదు. ఇతర మతాలవలే కాకుండా మూఢ విశ్వాసాలను ఆధారంగా చేసుకుని అందరూ గుడ్డిగా నమ్మమని చెప్పెది కాదు హిందు ధర్మం. ఇది దేనిని కూడా గుడ్డిగా నమ్మాలని చెప్పదు. ఏ అంశంలోనైనా సత్యాన్ని శోధించి తెలుసుకోవాలని చెబుతుంది. అయితే మన కర్మలే మన జీవితాన్ని స్వర్గం లేదా నరకం పోయేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు.
హిందు ధర్మం ఏంటంటే ప్రకృతి, దాని చుట్టు ఉండే తోటి ప్రాణులను కాపాడటం. ఈ ప్రపంచంలో ఎక్కడా చెడు ఉండదు. అంతా దైవత్వమేనని చెబుతున్నారు. మన శరీరం మాదిరిగానే ఈ విశ్వం కూడా పంచభూతాలతో సృష్టించబడింది. అంటే మన శరీరం కూడా చిన్న విశ్వ లాంటిదేనని అంటున్నారు. మనలో ఆత్మ, తెలివి, జ్ఞానం ఎలా ఉంటాయో విశ్వంలో కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
దేవుడు అనే వ్యక్తి జీవం కాదు. దైవం అనేది ఒక పవిత్రమైన, అనంతమైన శక్తి. ఇది శివుడు, గౌరీమాత కలయిక వల్లనే ఈ విశ్వం సృష్టించబడిందని పండితులు అంటున్నారు. పరమశివుడి భావాన్ని తెలుసుకుని మన ఆత్మను ఐక్యం చేయడమే మనకు సాక్షాత్కారం. అదే మన జీవిత గమ్యం. అదే సులభమైన మంచి మార్గమని నిపుణులు అంటున్నారు. అయితే హిందు ధర్మంలో శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంది. దాని ద్వారా సత్యం తెలుసుకుని ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఒక పద్దతి ప్రకారం జీవించవచ్చు. దీనినే ధర్మం అంటారు.
ఇక మతం అనేది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఎలా అంటే ఇది ప్రధానంగా మూఢ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ధర్మం ప్రపంచాన్ని కాపాడుతుంది. సత్యాన్ని అన్వేషించి పరమాత్మ గురించి తెలుసుకోవాలని చెబుతుంది. అనాదిగా కొనసాగుతున్న సనాతన ధర్మం అందరినీ కలుపుకుని పోతుంది. దీని నుంచే అన్ని రకాల ఇతర విశ్వాసాలు, ఆలోచనలు బయటకు వచ్చాయి. భారతదేశంలో ఏ కొత్త మతాలు రూపుదిద్దుకున్నాయో అవి అన్నియు ఈ తత్వశాస్త్రం నుంచే బయటకు వచ్చాయి. హిందూమతం సనాతన ధర్మంలోని ఒక రూపం మాత్రమే.