TG: ఇంటర్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 10లోపు వెల్లడికానున్నాయి. వీలైతే ఏప్రిల్ 6న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నందున ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి.. మే 31 నాటికి వాటి ఫలితాలు ఇవ్వాలని నిర్దేశించుకుంది. ఈనెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకనం ముమ్మరంగా సాగుతోంది.