GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా గురువారం ఉదయం 7 గంటలకు గోపూజ, సాయంత్రం 4:30కు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి చేత పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అర్చకులు, వేద పండితులకు సన్మానం కూడా జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని దేవస్థాన అధికారులు కోరారు.