బాపట్ల: చీరాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీని ప్లాస్టిక్ వాడకం రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని గతంలోనే తీర్మానం చేసుకున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తానని చెప్పారు.