మొసళ్లు సముద్రాలు (Seas) నదులు, చెరువుల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. కానీ పంట పొలాల్లోకి కూడా అవి వచ్చేస్తున్నాయి. వీటిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిని చూసిన జనాలు (masses) వెంటనే పరుగులు పెడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు గతంతో పలుచోట్ల జరిగుతున్నాయి. అమెరికా(America)లోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన ఓ వేటగాళ్ల గుంపునకు భారీ క్రొకడైల్ చిక్కింది. ఇంత పొడవైన మొసలి కనిపించడం చరిత్రలో ఇదే మొదటిసారని మిసిసిపీ (Mississippi) రాష్ట్రానికి చెందిన వైల్డ్‌లైఫ్, ఫిషరీస్ అండ్ పార్కుల విభాగం తెలిపింది.
ఆ క్రొకడైల్ (Crocodile) బరువును తూకం వేయగా 802.5 పౌండ్లు అంటే 364 కిలోలు ఉన్నది. పొడవు 14 అడుగుల మూడు అంగుళాలు ఉన్నది. గతంలో 14 అడుగుల రెండు అంగుళాల పొడవే రికార్డుగా ఉన్నది. దానికంటే ఇప్పుడు పట్టుబడ్డ మొసలి మరో అంగుళం పొడవు ఎక్కువగా ఉన్నది.మిసిసిపీలోని యాజూ సిటీలో ఎలిగేటర్ హంటింగ్ (Hunting) జోన్లో ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి మొసళ్ల వేట ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగుతో ఈ వేట ముగిసింది. ఈ క్రమంలో ఈ నెల 2న దొరికిన భారీ మొసలితో ఆ నలుగురు వేటగాళ్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.