మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ను కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బేటీ అయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా తుమ్మల ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తారని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని పొంగులేటి కొనియాడారు.ఇప్పటికే తుమ్మలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలిశారని… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్, బీఆర్ఎస్ పద్ధతి ఉందని విమర్శించారు. పొమ్మనకుండా పొగపెడతారని దుయ్యబట్టారు. తనకు చేసిన విధంగానే తుమ్మలను కూడా అవమానాలకు గురి చేశారని మండిపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ను వీడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తాను తన అనుచరులు, మద్దతుడారులతో చర్చించానని… వారందరి సూచనల మేరకే కాంగ్రెస్ (Congress) లో చేరానని పొంగులేటి చెప్పారు. తుమ్మల కూడా వారి అనుచరులతో మాట్లాడి, ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు.తుమ్మల మాట్లాడుతూ.. ‘‘నా చిరకాల మిత్రుడు పొంగులేటి నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. నా రాజకీయ జీవితం.. నా స్వార్ధం.. నా కుటుంబం కోసం కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికే. భద్రాద్రి(Bhadradri) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది. గోదావరి(Godavari)జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నా రాజకీయ లక్ష్యం. అనుచరులు మద్దతు దారులు తో మాట్లాడి రాజకీయ నిర్ణయం ప్రకటిస్తా’’ అన్నారు.