టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ వార్ జరిగింది. అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వయా బెంగళూర్ అని కవిత మొదలెట్టగా.. గల్లీలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు అని కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్- బీజేపీ గురించి రేవంత్ (Revanth) ప్రస్తావించగా.. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు బెంగళూర్ చేరాయని కవిత అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు.
గొడవ ఇలా..
ముందుగా కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ రెడ్డి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ వయా బెంగళూర్ అని రాశారు. రేవంత్ (Revanth) డీకే వద్దకెళ్లి కలువడంతో అలా రాశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అన్నారు. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం అని రాశారు.
అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ… కానీ ఇప్పుడు వయా బెంగళూరు
కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం… ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం… pic.twitter.com/dRJN89lamJ
రేవంత్ కౌంటర్
కవిత ట్వీట్‌కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. గల్లీలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు అని రాశారు. ఇదీ కేసీఆర్ మాజిక్ జగమెరిగిన నిక్కర్ లిక్కర్ లాజిక్కు అని కామెంట్ చేశారు.
ఏం జరిగిందంటే..
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడింది. వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. డీకే శివకుమార్‌తో చాలాసార్లు భేటీ అయ్యారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆమెను కలిశారు. తర్వాత ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని షర్మిల మీట్ అయ్యారు. పార్టీ విలీనం గురించి ఇండైరెక్ట్‌గా చెప్పేశారు. షర్మిల పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చేందుకు హైకమాండ్ అనుకుంటోంది. దీంతో షర్మిల ఎపిసోడ్ ముందకు కదలడం లేదు. అదే అంశాన్ని కవిత ప్రస్తావించగా.. రేవంత్ అందుకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.