»Mutthi Reddy Who Is Angry With Palla Has Evidence Of Land Grabs
Janagama : పల్లా పై రెచ్చిపోయిన ముత్తిరెడ్డి .. భూకబ్జాలపై ఆధారాలు ఉన్నాయి
జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి(Palla Rajeshwar Reddy)కి వ్యతిరేకంగా జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. దళిత ద్రోహి పల్లా గో బ్యాక్ అంటు ముత్తిరెడ్డి నినాదాలు చేశారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు బీఆర్ఎస్ (BRS) తరఫున ముత్తిరెడ్డి క్షమాపణలు తెలిపారు. దళితులపై కేసులు కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకమన్నారు. పల్లా భూకబ్జాలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయని తెలిపారు. ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి (Yadagiri Reddy) ఆరోపించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు సీఎం కేసీఆర్ (CMKCR) సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ (Janagama) నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతను కించపరిచినట్లేనని ఆయన అన్నారు. నియోజకవర్గం మీద.. స్థానిక నాయకుల మీద సోయి లేని నువ్వు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తవా అంటూ ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Election)ల్లో నా స్వంత ఖర్చులతో భోజనాలు పెట్టీ నిన్ను గెలిపించిన.. కానీ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అని చెప్పడం సిగ్గు చేటు అంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కబర్ధార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు అని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గంలో ఎక్కడ కబ్జా (Kabja) చేసిండో నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నాడు.