TV Actress Aparna Nair: మలయాళ టీవీ, సినీ నటి అపర్ణ నాయర్ (Aparna Nair) మృతిచెందారు. గురువారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అపర్ణ నాయర్ వయస్సు 33 ఏళ్లు కాగా.. ఆమెకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అపర్ణ (Aparna Nair) మృతికి గల కారణాలు తెలియరాలేదు.
రాత్రి 7.30 గంటల సమయంలో అపర్ణ (Aparna) సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమస్యల వల్లే అపర్ణ (Aparna) సూసైడ్ చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభించలేదని వివరించారు.
అపర్ణ (Aparna) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సూసైడ్ చేసుకునే 11 గంటల ముందు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అపర్ణ (Aparna) మలయాళ టీవీ సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. నాలుగైదు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. అపర్ణ (Aparna) ఆత్మహత్య విషయం తెలిసి మలయాళ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
అపర్ణ (Aparna) మృతికి సంబంధించి విచారణలో నిజ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె.. అర్ధాంతరంగా తిరిగిరానీ లోకాలకు వెళ్లడంతో సినీ ప్రముఖులు వాపోయారు. ఇటు బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కూడా నెలరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.