»Review Of Khushi Movie Starring Vijay Dewara Konda And Samantha
Kushi movie Review: ఖుషి మూవీ రివ్యూ..హిట్టా ఫట్టా?
విజయ్ దేవర కొండ, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ఖుషి ఈ రోజు(సెప్టెంబర్ 1) థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Review of Khushi movie starring Vijay Dewara Konda and Samantha
చిత్రం: ఖుషి నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిశోర్, మురళి శర్మ, జయరామ్, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. రచన & దర్శకత్వం: శివ నిర్వాణ నిర్మాత: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సినిమాటోగ్రఫి: మురళి జి ఎడిటర్: ప్రవీణ్ పూడి సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్ విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023
Kushi movie Review: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Dewara Konda ), స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు(సెప్టెంబర్ 1) వచ్చింది. ఒక భారీ డిజాస్టర్(Liger) తరువాత మళ్లీ అభిమానులను ఆకట్టుకోవడానికి వస్తున్న విజయ్ ఎంత వరకు సక్సెస్ సాధించారో, ట్రైలర్లో అందరిలో ఆసక్తిని పెంచిన డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) ఏ మేరకు విజయం సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
విప్లవ్(విజయ్ దేవరకొండ) ఉద్యోగ పనిమీద కశ్మీర్‌కు వెళతాడు. అక్కడ ముస్లిం అమ్మాయి అయిన ఆరాబేగంను(సమంత) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. బేగం కూడా విప్లవ్‌ను ఇష్టపడుతుంది. అయితే తాను బేగం కాదు ఒక బ్రహ్మణ్ అని తన పేరు ఆరాధ్య అని షాకింగ్ నిజం చెబుతుంది. తరువాత వారిద్దరు ప్రేమను పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలను కుంటారు. దానికి ఆరాధ్య తండ్రి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. పైగా మీరు పెళ్లి చేసుకుంటే కష్టాలు పడుతారని చెబుతారు. అయినా సరే పెద్దలను కాదని నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపించాలని వారిద్దరూ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో అసలు కథ మొదలు అవుతుంది. ఆ క్రమంలో వారికి ఒక దాని వెంట ఒకటి అనేక సమస్యలు వస్తాయి. అసలు సమంతా బేగంలా ఎందుకు మారింది? వీరిద్దరు ఎలా ఇష్టపడ్డారు? పెళ్లికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు? ఎదిరించి పెళ్లిచేసుకున్న వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది:
ఎప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే దర్శకుడు శివ నిర్వాణ ఈ సారి అది ఎక్కడో మర్చిపోయినట్లు ఉంది. సినిమా కశ్మీర్ నుంచి హైదరాబాద్ షిప్ట్ అయిన తరువాత అసలు పాయింట్ మొదలు అవుతుంది. జనరల్‌గా అందరూ అనుకున్నట్లే పెళ్లి తరువాత ఇది చేద్దాం. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. రెండు గంటల నలబై నిముషాలు ఉన్న ఈ సినిమా అక్కడక్కడ బోర్ కొట్టినా పర్లేదు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాలో ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఈ వీకెండ్ టైమ్ పాస్ అవకుంటే ఫ్మామిలీతో వెళ్లొచ్చు.
ఎవరెలా చేశారు:
విజయ్ దేవర కొండకు ఒక సపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ కొత్తగా కనిపిస్తారు. లుక్ వైజ్‌గా చాలా డీసెంట్‌గా ఉన్నారు. ఫర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్లలో విజయ్ నటన సింపుల్‌గా ఉంటుంది. సమంతకు మైయోసైటీస్ వచ్చినప్పటి నుంచి తన లుక్స్‌లో ఓల్డ్ బ్యూటీ కనిపించడం లేదు. నటన విషయానికి వస్తే చాలా బాగా చేసింది. హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ తెరపై బాగ పండింది. మురళి శర్మ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడెకర్ తదితరులు వారి ఉన్నంతలో మెప్పించారు. కామెడీని కూడా పూయించారు. సినిమాకు సంగీతం ప్రాణం అని చెప్పవచ్చు. ఈ విషయంలో సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ తన బెస్ట్ ఇచ్చాడు. అలాగే సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. కొన్ని లొకేషన్లు మైమరిపించేలా ఉంటాయి. మొత్తానికి మురళి అద్భుతమైన వర్క్‌ను ఇచ్చారు. ఇక డైరెక్టర్ కథను ఫ్యామిలీ ఆడియేన్స్ను టార్గెట్‌గా రాశాడు. ఇది వరకు శివనిర్వాణ సినిమాలు ఉన్నట్లే ఉంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.