Muthireddy Yadagiri Reddy Fires On Palla Rajeshwar Reddy
Muthireddy Yadagiri Reddy: జనగామలో బీఆర్ఎస్ టికెట్ లొల్లి పీక్కి చేరింది. ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) తీవ్ర విమర్శలు చేశారు. పళ్లా ఎలా ఎదిగారో మీడియాకు వివరించారు. పళ్లా సొంత సోదరి జయప్రదను మోసం చేశారని ఆరోపించారు. దాంతో ఆమె మానసిక వేదనకు గురై.. ఇంటిపట్టునే ఉంటున్నారని తెలిపారు.
పళ్లా సోదరి జయప్రద తనకు కూడా తెలుసని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) వివరించారు. ఆమె భర్తను మావోయిస్టులు హత్య చేశారని గుర్తుచేశారు. కుమారులు అమెరికాలో ఉండగా.. ఇంజినీరింగ్ కాలేజీ పెట్టాలని ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. కాలేజీ వ్యవహారాలు చూసుకోవాలని తమ్ముడు పళ్లాను కోరితే.. తనకు ఏ పదవీ లేకుంటే ఎలా అన్నారని వివరించారు. అలా ట్రస్టీ పదవీ తీసుకొని.. చివరకు ట్రస్టీలను అందరినీ తనవైపునకు తిప్పుకొని.. చైర్మన్ కాలేదా అని గుర్తుచేశారు. తమ్ముడు చేసిన మోసంతో జయప్రద మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఇప్పటికీ తన ఇంట్లో ఒంటరిగా ఉంటుందని.. కొడుకులకు చెప్పలేక, తనలో తానే కుమిలిపోతుందని చెప్పారు.
జనగామ నియోజకవర్గాన్ని ఏ రోజైనా పట్టించుకున్నావా అని సూటిగా నిలదీశారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy). ఇప్పుడు వచ్చి.. ఇక్కడ పోటీ చేస్తా అని.. స్థానిక నేతలను డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీని, క్యాడర్ను మలినం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జనగామ జనంతో సంబంధం లేదని.. ఎలా సేవ చేస్తావో చెప్పాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అడిగారు.
జనగామలో బీఆర్ఎస్ నాయకుల కొట్లాట
పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ముత్తిరెడ్డి. జయప్రద అనే మీ అక్కకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు లాక్కొని ఆమెను మానసిక వేదనకు గురి చేశావు.
ఏడేళ్లలో ఏ పని చేయని నీవు.. ఇప్పుడు ఎలా చేస్తావని ముత్తిరెడ్డి అడిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావో చెప్పాలన్నారు. అతనిపై ఏ కేసులు ఉన్నావో వివరించాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటీ అని ప్రశ్నించారు. అలాగే తాను భూ కబ్బాలకు పాల్పడినట్టు నిరూపిస్తే ప్రాణాత్యాగానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు ముత్తిరెడ్డి (Muthireddy Yadagiri Reddy).