»Minister Ktr Offers Corporation Chairman Post To Muthireddy Yadagiri Reddy And Rajaiah
KTR: ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవీ?, రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా రాజయ్య..?
తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కష్టపడాలని కోరగా.. ఇద్దరు నేతలు అంగీకరించారని తెలిసింది.
Minister KTR Offers Corporation Chairman Post To Muthireddy Yadagiri Reddy And Rajaiah
Minister KTR Offers Corporation Chairman Post: అధికార పార్టీలో రెండు, మూడు చోట్ల అసంతృప్త నేతలు ఉన్నారు. ధిక్కార స్వరం వినిపించే నేతలకు చెక్ పెట్టారు. కార్పొరేషన్ పదవుల పేరుతో కూల్ చేశారు. దీంతో జనగామ, స్టేషన్ ఘనపూర్‌లో అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పెద్దలు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. అందరినీ కలుపుకొని వెళ్లాలని, విజయం కోసం కృషి చేయాలని కోరడంతో అంతా ఒక్కటై ముందుకు నడుస్తున్నారు.
జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy).. భూముల అక్రమణలు, సొంత కూతురు విమర్శలు, కలెక్టర్‌తో వివాదం నేపథ్యంలో ముత్తిరెడ్డి విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఆయనను హైకమాండ్ పక్కన పెట్టింది. తనకే టికెట్ ఇవ్వాలని రచ్చ రచ్చ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఇస్తామని.. గుమ్మన ఉండాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతో ఆయన ఓకే అన్నట్టు తెలుస్తోంది. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇస్తారని సమాచారం.
స్టేషన్ ఘనపూర్‌లో అంతకుమించి రాజకీయాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah).. టికెట్ తనకే అంటూ హంగామా చేశారు. జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన బాధ వర్ణణాతీతం. ఎక్కడ కనిపిస్తే అక్కడ.. కార్యకర్తలను పట్టుకొని ఏడ్చారు. మధ్యలో కాంగ్రెస్ నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. దీంతో మంత్రి కేటీఆర్ రాజయ్యను పిలిపించుకొని మాట్లాడారు. రాజయ్యను పళ్లా రాజేశ్వర్ రెడ్డి కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. ఆయనకు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవీ ఇస్తామని ప్రకటించారు. దీంతో రాజయ్య కూడా శాంతించారు.
సో.. ఇలా ఇద్దరు కీలక నేతలకు మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. కార్పొరేషన్ పదవీ ఇస్తామని చెప్పి.. గుమ్మనకుండా చేశారు. ఈ రెండు తప్ప మిగతా చోట్ల అంతా సవ్యంగానే ఉంది. మల్కాజిగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన మైనంపల్లి హన్మంతరావు మాత్రం పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోకి వెళ్లే విషయం త్వరలో తెలియజేస్తానని ప్రకటించారు.