Kadiam Srihari And Rajaiah Are United
Kadiam Srihari And Rajaiah Are United
Kadiam- Rajaiah: స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం ఎమ్మెల్యే రాజయ్య (Rajaiah) బీఆర్ఎస్ పార్టీలో కాక రేపారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. వారి మధ్య ఉండి ఏడ్చేశారు. తర్వాత కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరపడంతో.. పార్టీ మారాతారా అనే చర్చ జరిగింది. ఘనపురం బాధ్యతలను బీఆర్ఎస్ హైకమాండ్ పళ్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించింది. వెంటనే ఆయన రంగంలోకి దిగి.. ఇద్దరు నేతలను కలిపారు. ఆ ఇద్దరూ నేతలు.. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఫోటోలకు ఫోజులిచ్చారు.
పళ్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్యతో సంప్రదింపులు జరిపారు. కడియంతో డిస్కషన్ చేశారు. రాజయ్యకు పదవీ ఇస్తామని రాజేశ్వర్ చెప్పినట్టు ఉన్నారు. దాంతో టికెట్ ఇచ్చిన కడియం శ్రీహరిని గెలిపించేందుకు సహకరిస్తానని రాజయ్య ప్రకటించారు. తర్వాత రాజయ్య, కడియం శ్రీహరిని తీసుకొని మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లారు రాజేశ్వర్ రెడ్డి. అక్కడ కడియం శ్రీహరికి రాజయ్య పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉప్పు- నిప్పుగా ఉన్న నేతలు కలువడం చర్చానీయాంశమైంది. ఇతర పార్టీ వైపు చూసిన రాజయ్య మెత్తబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. నామినెట్ పదవీ ఇస్తామని అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు హైకమాండ్ చెప్పి ఉంటది. అందుకే ఆయన మెత్తబడ్డారు. లేదంటే వేరే పార్టీ.. లేదంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేవారు.
ఇటు జనగామ టికెట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. అక్కడినుంచి పోటీ చేయాలని పళ్లా రాజేశ్వర్ రెడ్డి భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యను బీఆర్ఎస్ పార్టీ ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలీ మరీ.