అమృత.. ప్రణయ్‌ని ఇప్పుడిప్పుడే మరచిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల ఫ్యాషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం.. రీల్స్ చేయడంతో అలా అనిపిస్తోంది. దాంతోపాటు హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ స్టెప్పులేశారు.
Amrutha Pranay: అమృత (Amrutha) ప్రేమించి, పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని (Pranay) ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేయించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ప్రణయ్ ప్రతీరూపంగా.. ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారిలో ప్రణయ్‌ను చూసుకుంటూ వచ్చింది. కొత్త జీవితం ప్రారంభించాలని ఎవరెన్ని చెప్పినా.. వినిపించుకోలేదు. ఇప్పుడిప్పుడే కాస్త మారినట్టు అనిపిస్తున్నారు. కొత్త లోకంలో అడుగుపెడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇన్ స్టలో పోస్టులు, వీడియోలు పెడుతూ.. ఫ్యాషన్ రంగం వైపు చూస్తున్నారు.
కొందరు ప్రముఖులతో అమృతకు (Amrutha)పరిచయాలు ఉన్నాయి. అలా సెలబ్రిటీలతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. కార్తికీయ కొత్త మూవీ బెదురులంక 2012.. ఆ మూవీ సక్సెస్ అయ్యింది. మూవీ ప్రమోషన్ కోసం అమృతతో కలిసి స్టెప్పులు వేశాడు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. డ్యాన్స్ చేసే సమయంలో అమృత ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయని నెటిజన్లు అంటున్నారు.
చీరకట్టుకొని.. చక్కగా అందంగా ఉంది అమృత.. ఫ్యాషన్ రంగంలో ఉన్న అమృత.. త్వరలో వెండితెర మీద కనిపించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మంచి ఫాలొయింగ్ ఉన్న ఆమె.. నటించి ఆకట్టుకోగలదని నెటిజన్స్ అంటున్నారు. అమృత కూడా ఇండస్ట్రీ.. లేదంటే వెబ్ సిరీస్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె నటిస్తారా లేదో చూడాలీ.. కార్తికేయతో కాసేపు రీల్ చేసింది. నటనపై ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాత్రం చెప్పలేదు. సో.. ఆమె ఎంట్రీ ఇచ్చేవరకు అదీ సస్పెన్సే.