SKLM: పలాసపురంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. రైతు బెందాళం అశోక్ దంపతులు నిద్రిస్తున్నసమయంలో ఇంటి ముందు ఉంచిన నిచ్చెన, గునపం సాయంతో వెంటిలేటర్ తీసి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, నగదు, వాచీతో పాటు ఇతర వస్తువులు దొంగిలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు ఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.