#PawanKalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు (PawanKalyan) అభిమానులు ఎక్కువే.. పవన్ కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. ఆయన మూవీ వచ్చిందంటే చాలు.. ఫస్ట్ డే.. నానా హంగామా ఉంటుంది. రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. జనసేన పార్టీ సభలు, సమావేశాలకు మెజార్టీగా హాజరయ్యేది అభిమానులే. టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలొయింగ్లో పవర్ స్టార్ తర్వాతే ఇతర స్టార్స్ ఉంటారు. ఇప్పుడు ట్విట్టర్లో పవన్ పేరు ట్రెండ్ అవుతోంది. #PawanKalyan పేరుతో పవన్ (Pawan) ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
ఇప్పట్లో పవన్ (Pawan) మూవీస్ లేవు.. అయినా ట్రెండ్ అవుతుంది. కారణం ఏంటంటే.. వచ్చే నెల 2వ తేదీన పవన్ కల్యాణ్ బర్త్ డే. అందుకోసమే పవన్ (Pawan) పేరుతో అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఆయన పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ఏడాది పవన్ కల్యాణ్ (Pawan) 52వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం ఆయనకు చాలా ఇంపార్టెంట్.. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించబోతున్నారు. వారాహి వాహనంలో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టారు.
సినిమా, రాజకీయం
అటు రాజకీయాలు.. సమయం దొరికితే చాలు సినిమాలు చేస్తున్నారు. పవన్ (Pawan) నెక్ట్స్ మూవీ ఓజీ.. ఈ మూవీపై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. సినిమా కూడా అలానే ఉంటుందని డైరెక్టర్ సుజిత్ భరోసా ఇస్తున్నారు. ఆ మూవీలో పవన్ మాస్ లుక్స్‌తో.. గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తాడని లీకులు ఇచ్చారు. దీంతోపాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సురేందర్ రెడ్డి మరో సినిమా ఉంది. ఆయా సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని.. ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేయాలని పవర్ స్టార్ అనుకుంటున్నారు.
తొలిప్రేమతో హిట్
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగ్రేటం చేశారు పవన్ కల్యాణ్ (Pawan). కానీ ఆ మూవీ అంత హిట్ కాలేదు. కానీ ఫ్యాన్స్ ఫాలొయింగ్ మాత్రం అప్పడినుంచే ఏర్పడింది. ఆ వెంటనే తీసిన గోకులంలో సీత, సుస్వాగత కూడా హిట్ రాలేదు. 1998లో తీసిన తొలి ప్రేమ మూవీ పవన్ లైఫ్ టర్నింగ్ ఇచ్చింది. ఆ సినిమాలో బాలు క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత పవన్ వెనుదిరిగి చూడలేదు. బద్రీ, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తరాంటికి దారేది, వకీల్ సాబ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
రాజకీయాలతో బిజీ
కెరీర్ తొలినాళ్లలో ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీశారు. కానీ తర్వాత పవన్ (Pawan) సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో.. యువరాజ్యం బాధ్యతలను చూసుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. వరసగా రెండు పర్యాయాలు ఏపీలో పరోక్షంగా.. ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మూడో సారి సీరియస్‌గా తీసుకొని.. తన పార్టీకి ఓట్లు వేయాలని కోరుతున్నారు.