బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh khan) యాక్ట్ చేసిన 'జవాన్' మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో షారుఖ్ నిన్న ఆస్క్ SRK ట్విట్టర్ సెషన్లో భాగంగా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన క్రేజీ ప్రశ్నలకు షారుఖ్ ఏం చెెప్పారో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh khan) శనివారం ఆస్క్ SRK సెషన్లో ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ బట్టతల లుక్‌లో జవాన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారా అని ఒక అభిమాని అడిగారు. ఈ ప్రశ్నకు షారుఖ్ చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చారు. నాపై ప్రేమను చూపించేందుకు సల్మాన్ భాయ్ రూపాన్ని చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను అతన్ని ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు.
ఒక ట్విట్టర్ వినియోగదారు మీరు గదర్ 2(gadar 2) చూశారా అని షారుక్‌ను అడిగారు. సన్నీ డియోల్ చిత్రాన్ని ఇష్టపడ్డానని చెప్పాడు. అయితే షారుఖ్ ఖాన్, సన్నీడియోల్ మధ్య శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి గతంలో డర్ సినిమాలో పనిచేశారు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటించగా, షారుక్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎక్కువ పేరు వచ్చింది. దాని కారణంగా సన్నీ డియోల్ కోపం తెచ్చుకున్నాడు. విలన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అలియా భట్ ఇటీవల జాతీయ అవార్డు గెలుచుకోవడంపై కూడా షారూఖ్ స్పందించారు. జవాన్(jawan) మూవీ మినిమం ఎన్నిసార్లు చూడగలమని మరో వ్యక్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఖాన్ ఓ సారి మనసు కోసం..మరోసారి శరీరం, ఇంకోసారి వినోదం, సరదాగా నాలుగు సార్లు చూడవచ్చని బదులిచ్చారు. మీరు మణిరత్నం, అట్లీ, విజయ్ సేతుపతితో పని చేశారు. సౌత్ ఇండియన్ స్టార్స్‌తో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుందని ఓ వ్యక్తి అడిగారు. వారు చాలా చిత్తశుద్ధితో పని చేస్తారని, దీంతోపాటు వారి ఆహారం చాలా రుచికరంగా ఉంటుందని షారుఖ్ అన్నారు. ఈ క్రమంలోనే అభిమానుల అనేక ప్రశ్నలకు ఖాన్ సమాధానం ఇచ్చారు. కాగా షారుఖ్ నటించిన ‘జవాన్’ మూవీ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, రిద్ధి డోగ్రా, సన్యా మల్హోత్రా, దీపికా పదుకొణె సహా పలువురు నటీనటులు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి(vijay sethupathi) విలన్‌గా కనిపించనున్నాడు.