ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని(ram pothineni), శ్రీలీల(sreeleela) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్కంద ట్రైలర్(Skanda Trailer)ను మేకర్స్ నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ అయితే మాములుగా లేవు. మీరు కూడా ఓసారి ఈ ట్రైలర్ పై లుక్కేయండి మరి.
యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్(ram pothineni), శ్రీలీల(sreeleela), బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా మూవీ స్కంద ట్రైలర్(Skanda Trailer) విడుదలైంది. గ్లింప్స్, టీజర్ ఇప్పటికే సినిమాకు కావాల్సిన హైప్‌ని పెంచేశాయి. ఈ నేపథ్యంలో నిన్న(ఆగస్టు 26న) రాత్రి ప్రీ రిలీజ్ థండర్ అనే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ వీడియో ఒక టెంపుల్ టౌన్ చూపించడం ద్వారా ప్రారంభమవుతుంది. అంతేకాదు హీరో రామ్ మాస్ ఎంట్రీ, పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్ లో సినిమా ప్లాట్లైన్ను చూపించనప్పటికీ, దీనిలో దాదాపు అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. దీంతోపాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ ను కూడా ఉంది. బోయపాటి శ్రీను.. రామ్‌ని మునుపెన్నడూ లేని విధంగా మాస్ క్యారెక్టర్లో చూపించారు. బోయపాటి(Boyapati Srinu)స్పెషల్ ఫైట్స్(fights) కు తోడు థమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాకుండా రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను మరింత ఆకర్షణగా చూపించింది. మొత్తంమీద ట్రైలర్ మాత్రం మాస్ ఫీస్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఈ మూవీ సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.