TNBreakfastScheme 31 వేల స్కూళ్లలో పొడగింపు..15 లక్షలమందికి ప్రయోజనం
తమిళనాడు ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని మరింత విస్తరించింది. మరో 31 వేల స్కూళ్లలో స్కీమ్ అమలు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.
TNBreakfastScheme: తమిళనాడులో (tamilnadu) గత ఏడాది విద్యార్థుల కోసం బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్ (టిఫిన్) ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చి తినేవారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఆ పథకానికి మంచి స్పందన వచ్చింది. ఏడాది గడిచినందున మరో 31 వేల స్కూళ్లలో (school) బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని ఈ రోజు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని అన్నివర్గాలు స్వాగతించాయి. వెంటనే సోషల్ మీడియా ట్విట్టర్లో థాంక్యూసీఎంసర్, టీఎన్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ వల్ల దాదాపు 15 లక్షల (15 lakhs) మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది. దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలు.. పేదలు, తమ పిల్లలకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించలేరు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ఈ స్కీమ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. థాంక్యూ సీఎం సర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఉచితంగా అల్పాహారం ఇస్తున్నారు. దానిని మరిన్ని స్కూళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.