Rahul Gandhi: China has taken India's land... PM Modi is lying
Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైరయ్యారు. చైనా భారత భూమిని క్రమంగా తీసుకుంటుందని.. కానీ మోడీ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. ప్రతిపక్షాలతో జరిగిన సమావేశంలో మోడీ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. లడాఖ్ నుంచి చైనా ఇంచు భూమి కూడా తీసుకోలేదని అసత్యాలు వల్లించారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
లడాఖ్‌లో సోలార్ ఎనర్జీ కొరత లేదని.. ఈ విషయం బీజేపీ, ప్రజలకు కూడా తెలుసు అని చెప్పారు. ఇదీ భూమికి సంబంధించిన విషయం అని.. చైనా లాక్కొవాలని అనుకుంటుందని వివరించారు. దేశంలో బీజేపీ-ఆరెస్సెస్ చేస్తోన్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా నిలబడేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి తెలిపారు. యాత్ర సమయంలో మంచు వల్ల లడఖ్ రాలేకపోయానని రాహుల్ (Rahul) పేర్కొన్నారు. ఇక్కడ యాత్ర చేపట్టాలని అనుకున్నానని.. వీలు పడలేదని.. ఈ సారి టూ వీలర్‌పై తీసుకెళతానని చెప్పి, అక్కడున్న వారిని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.
భారత్- చైనా సరిహద్దు వివాదాంపై ఈ నెల 20వ తేదీన కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రజలను తాను కలిశానని.. తమ భూమిపై చైనా పట్టు సాధిస్తోందని తనకు చెప్పారని వివరించారు. కానీ ప్రధాని మోడీ మాత్రం దేశ ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. తన ప్రభుత్వ అసమర్ధతను దాస్తున్నారని దుయ్యబట్టారు.