WGL: నెక్కొండ మండలం భూక్య తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటున్న చిన్నారిని పాము కాటు వేయడంతో మృతిచెందగా విషాద ఛాయలు అమలుకున్నాయి. లావుడ్యా తిరుపతి-సుజాత దంపతుల కుమార్తె కుట్టి (3) నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. పాప నోటి నుంచి నురుగు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది.