ASR: జిల్లాలో అమలవుతున్న ‘జల్ జీవన్ మిషన్’ పనులు వేగవంతం చేసి గ్రామాలకు తాగునీరు అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు సరఫరాకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, తాగునీరు సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.