ప్రకాశం: రంజాన్ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో మంగళవారం ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు హాజరై ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.