Pushpa 2: Astrologer Venu Swamy's Comments On Allu Arjun-Rashmika Mandanna's Much Awaited Sequel Goes Viral
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్-వెయిటింగ్ సీక్వెల్, పుష్ప 2 పుష్ప: ది రూల్. సుకుమార్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఃసెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన జోతిష్కుడు వేణు స్వామి.. మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 రిజల్ట్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. “సినిమా మొదటి పార్ట్ లాగానే పెద్ద విజయం సాధించబోతోంది. మరో పదేళ్లు అల్లు అర్జున్ టాలీవుడ్‌ని పాలిస్తాడని అన్నారు. ఆ మాటలు విని ప్రస్తుతం బన్నీ ఫ్యాన్సీ పండగ చేసుకుంటున్నారు. హీరో ఆదిపిని శెట్టి, ఆయన భార్య నిక్కీ గల్రానీ వైవాహిక జీవితంపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారు త్వరలో విడాకులు తీసుకుంటారు అంటూ బాంబు పేల్చారు. మరి ఇప్పటి వరకు అన్నీ ఆయన చెప్పినవన్నీ జరిగాయి. ఆదిపిని శెట్టి విషయంలో జరుగుతుందో లేదో చూడాలి.
పుష్ప మూవీలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్, కల్పలత తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని , వై రవి శంకర్ నిర్మించిన పుష్ప 2 సిబ్బంది దాని పార్ట్ 1 కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు కార్తీక శ్రీనివాస్, రూబెన్ ఎడిటింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సీక్వెల్ కోసం బడ్జెట్ దాదాపు రూ.500కోట్లు అవుతుందని తెలుస్తోంది.