పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్ల పట్ల తన ఉదారతను, గౌరవాన్ని చాటారు. భోగి పండగ సందర్భంగా కొందరిని ఎంపిక చేసి.. వారికి పాద పూజ చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. కాకినాడ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగారు. ఆ తర్వాత వారందరిని ఘనంగా సన్మానించారు.
పారిశుద్ద్య కార్మికులు సమాజం కోసం నిత్యం శ్రమిస్తారు. వారు చేసిన పనికి కృతజ్ఞతగా మాత్రమే తాను ఈ పని చేశానని వివరించారు. కార్మికుల పాద పూజ చేయడం తనకు లభించిన గొప్ప వరం అని అభివర్ణించారు. ఈ ఒక్కసారే కాదే.. ఏటా 10 మందిని ఎంపిక చేసి, పాద పూజ చేస్తానని వివరిస్తున్నారు. మిగతా వారు పారిశుద్య కార్మికులను చిన్నచూపు చూడొద్దనే సందేశం చేశారు. అందరూ తనలా చేయకున్నా ఫర్లేదు.. కానీ శానిటేషన్ వర్కర్లను,వారి పనిని గౌరవించాలని కోరారు.