పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఒకేసారి ఇన్ని సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు.. అది కూడా వేల కోట్ల ప్రాజెక్ట్స్‌ను ఎలా డీల్ చేస్తున్నాడు.. అనేది ఇండస్ట్రీ వర్గాలకు అర్థం కాని విషయమే. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లైన్లో ఉన్నాయి. మధ్యలో మారుతికి కూడా ఛాన్స్ ఇచ్చాడు. వీటితో పాటు స్పిరిట్ రెడీగా ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే.. మరో భారీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని చెప్పేశారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ బడా నిర్మాణ సంస్థలో.. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలొచ్చాయి. ఈ క్రమంలో వీరసింహా రెడ్డి చిత్ర యూనిట్.. బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. అందులో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ప్రభాస్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కన్ఫర్మ్ చేశారు.
Prabhas Signed for Another Bollywood Movie
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాతో.. తాము బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలిపారు. దీంతో ప్రభాస్ నుంచి మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన షారుఖ్ ఖాన్ ‘పటాన్’ చిత్రం.. జనవరి 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. బహుశా ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ పై సిద్ధార్థ్ ఆనంద్ దృష్టి సారించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ చెప్పారు కాబట్టి.. ఈ బిగ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా ప్రభాస్ చర్చల లిస్ట్‌లో ఇంకెన్ని సినిమాలున్నాయో ఊహంకందని విషయమే.