GDWL: జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోడౌన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ సీల్‌ను తెరిచి లోపల భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు (BU), కంట్రోల్ యూనిట్లు (CU), వీవీప్యాట్ (VVPAT) యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎన్నికల సామాగ్రి భద్రతపై సిబ్బందికి పలు సూచనలు కలెక్టర్ చేశారు.