RR: నార్సింగి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ఆక్రమణల తొలగింపుపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై రాజేష్ గౌడ్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారుల బృందం దగ్గర ఉండి మరీ పర్యవేక్షించారు. అల్లు స్టూడియో నుంచి కోకాపేట విలేజ్ వరకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.