KNR: ఇల్లందకుంటలో పశు వైద్యశాల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ధార సురేశ్ ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 140కు పైగా పశువులకు టీకాలు వేశారు.