SRD: జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో వర్క్ షాప్ మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచేందుకే ఈ వర్క్ షాప్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏఐ సాంకేతికతను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.