»Kcr Gave Good News To Panchayat Workers 5 Lakh Insurance Announced By Brs Govt
KCR: పంచాయతీ కార్మికులకు శుభవార్త చెప్పిన కేసీఆర్
పంచాయతీ పారిశుధ్య కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎల్ఐసీ ద్వారా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది.
KCR Bhima- Prati Intiki Dhima kcr announce New Scheme
KCR: గ్రామాలను(Villages), పట్టణాల(Cities)ను దేశా(Country)న్నే శుభ్రపరిచేవారు పారిశుధ్య కార్మికులు(Sanitation workers). వారిని గౌరవించుకోవాల్సిన అవసరం మన బాధ్యత. వారు లేకపోతే పరిసరాలు మురికితో నిండిపోతాయి. రోడ్లపై చెత్త పేరుకుపోయి కుళ్లిన వాసనలు వస్తాయి. అందుకే వారికి తగిన గౌరవంతో పాటు పనికి తగ్గ జీతం ఇవ్వాలని గత నెల రోజులుగా ధర్నా చేశారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టత వచ్చాక తిరిగి విధుల్లోకి చేరారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారందరికి కేసీఆర్(KCR) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 5 లక్షల ఇన్సూరెన్స్(5 lakh insurance) సౌకర్యం కల్పిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు, పారిశుధ్య కార్మికులకు మరణిస్తే వారి అంత్యక్రియలకు అందించే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ కార్మికులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎల్ఐసీ(LIC) ద్వారా ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు దీని మొత్తాన్ని గ్రామపంచాయతీనే చెల్లిస్తుందని పేర్కొన్నారు. అయితే ఒక్కో కార్మికుడు ఎంత మొత్తం చెల్లిస్తారనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఇది వరకు అంతిమ సంస్కారాలకు రూ.5 వేలను చెల్లించేవారు. ఇప్పుడు దీన్ని రూ. 10వేలకు చేసినట్లు తెలిపారు. ఈ రెండు పథకాలను సక్రమంగా అమలు చేసేలా జిల్లా పంచాయతీ అధికారులకు సూచించినట్లు డైరెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.