»18 People Die Every Day In Maharashtra Government Hospital
Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది మృతి
మహారాష్ట్రలోని థానే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే 18 మంది రోగులు మృతి చెందారు. దీనిపై సీఎం ఏక్నాథ్ శిండే సైతం స్పందించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇంత మంది ఒకేసారి చనిపోవడం స్థానికంగా కలవరం రేపుతోంది.
18 people die every day in Maharashtra government hospital
Mumbai: మహారాష్ట్ర(Maharashtra)లోని ఓ ప్రభుత్వాసుపత్రి(hospital)లో ఒక్కరోజులో భారీ సంఖ్యలో రోగులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆరా తీశారు. థానేలోని కల్వాలో ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) ఆసుపత్రిలో 24గంటల వ్యవధిలో 18 మంది మృతి చెందినట్లు పురపాలక శాఖ కమిషనర్ అభిజిత్ బంగార్ ఆదివారం సాయంత్రం తెలిపారు. మరణించిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలిపారు. మృతుల్లో థానే నగరానికి చెందినవారు ఆరుగురు ఉన్నారు. అలాగే కల్యాణ్ నగరానికి చెందినవారు నలుగురు, షాపూర్ నుంచి ముగ్గురు, భీవాండి, ఉల్హాస్నగర్, గోవండి (ముంబయి) ప్రాంతాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని.. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.
అయితే మృతుల్లో 12 మంది 50 కి పైబడిన వయసుగలవారని వెల్లడించారు. ఈ ఘటనతో థానే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నెలకొన్న పరిస్థితులపై సీఎం ఏక్నాథ్ శిండే(CM Eknath Shinde) ఆరా తీశారని అభిజిత్ బంగార్ పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలాని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు చెప్పారు. అయితే ఆసుపత్రి వైద్యులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చాలా మంది ఆరోగ్యం విషమించాక ఆసుపత్రిలో చేర్చడం, వయో భారం రీత్యా ఈ మరణాలు సంభవించాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై మంత్రి సావంత్ కూడా స్పందించారు. అలాగే 24 గంటల వ్యవధిలో ఇలా జరగడానికి కారణం ఏంటన్నది రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మరణాల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేశారు.