ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల(MLC)ను భర్తీ చేశారు. గత నెల 20న రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో పలువురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. వీరిలో కర్రి పద్మశ్రీ,(Karri Padma Shri) కుంభా రవిబాబును ఖరారు చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వద్దకు సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు(Kumbha Ravi Babu)ను గవర్నర్ ఆమోదించారు. అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గవర్నర్ కోటా(Governor’s Quota)లో ఎమ్మెల్సీలుగా పని చేసిన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎండీ ఫరూర్ పదవీ కాలం జులై 20తో ముగిసింది. దీంతో ఈ రెండు స్థానాలకు కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబును నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈమేరకు ఎన్నికల ప్రధానాధికారి జీవో నెంబరు 87ను జారీ చేశారు. గవర్నర్ నామినేట్ చేసిన శాసన మండలి సభ్యుల పదవీకాలం నోటిఫికేషన్ (Notification) జారీ చేసిన తేదీ నుంచి ఆరేళ్లపాటు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు.ఈ మేరకు ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. నూతన ఎమ్మెల్సీలుగా నియామకంకావడంతో పద్మశ్రీ, రవిబాబుకి పలువురు వైసీపీ నేతలు అభినందనలు తెలిపారు. సీఎం జగన్(CM Jagan), గవర్నర్ ఆమోదంతో తమకు ఈ పదవులు దక్కాయని, చాలా బాధ్యతగా తమ విధులను నిర్వర్తిస్తామని కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు తెలిపారు.