ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ (Uber Cab) డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరు(Bangalore)లో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. ఒక మహిళ బుక్ చేసిన క్యాబ్‌కు బదులు పొరపాటున మరో క్యాబ్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆ మహిళతోపాటు ఆమె కుమారుడిపై దాడి చేశాడు (Uber driver attacks woman). ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఓ మహిళ తన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ (Cab Book) చేసింది. కొంతసేపటి తర్వాత క్యాబ్ బుక్ చేసిన ప్రదేశానికి చేరుకుంది. కొడుకుతో కలిసి ఆ మహిళ క్యాబ్‌లో కూర్చొని ఉండగా.. మరో క్యాబ్ ఘటనాస్థలికి వెళ్లింది. కారు కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ మరో క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయి.. వివాహిత మహిళ క్యాబ్ దిగి బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కబోతుండగా డ్రైవర్ ఒక్కసారిగా క్యాబ్ ఆపి ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు.
అపార్ట్మెంట్ (Apartment) ముందు మహిళ తలపై కొట్టిన డ్రైవర్ ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. దాడిని ఆపడానికి స్థానికులు జోక్యం చేసుకోవలసి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన 25 ఏళ్ల డ్రైవర్ బసవరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిఘా కెమెరాల్లో చిక్కింది.ఈ విషయాన్ని మహిళ భర్త సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ హబ్ (IT hub) బెంగళూరు ప్రజలు మండిపడుతున్నారు. వివాహిత మహిళ అని కూడా చూడకుండా, ఆసుపత్రికి వెలుతున్న ఆమె మీద నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ దాడి చెయ్యడం దారుణమని తెలిపారు.ఉబెర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు.ఈ నేపథ్యంలో 25 ఏండ్ల ఉబర్ క్యాబ్ డ్రైవర్ బసవరాజును పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. అయితే ఆ మహిళ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.