Khushi Kapoor: నీలి రంగు చీరలో చందమామ నువ్వు ‘ఖుషీ’..!
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ అందరికీ సుపరిచితమే. ఆమె ఇప్పటికే బాలీవుడ్ లో వరస సినిమాలతో అదరగొడుతోంది. ఇక మరో తనయ ఖుషీ తన అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ లోగా, తన అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.
నీలిరంగు చీరలో శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ మెరిసింది. ఆమెను చీరలో చూసిన తర్వాత ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అంత అందంగా ఉంది. చాలా రేర్ గా ఖుషీ ఇలా చీరలు, లెహంగాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. చీరల్లో హాటు ఫోజులు ఇస్తూ, తన చేతులపై టాటూలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్లు టాటూలు వేయించుకోవడం చాలా కామన్.
ఎక్కడో ఒకటో రెండో టాటూలు వేయించుకుంటారు. కానీ ఖుషీ ఏకంగా తన రెండు చేతుల నిండా టాటూలు వేయించుకోవడం విశేషం. మామూలుగా అయితే ఆ టాటూలు కనిపించడం లేదు. కానీ ఆమె తన చేతులు పైకి ఎత్తి, ఫోటోలకు ఫోజులు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ టాటూలు కనపడుతున్నాయి. కేవలం చేతులమీదే చాలా ప్లేసుల్లో వేయించుకోవడం గమనార్హం. ఇప్పుడు ఆమె చీరకట్టుకున్న ఫోటోలతో పాటు, టాటూ ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి.