NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నదాన పథకానికి ఇవాళ పలువురు విరాళాన్ని అందజేశారు. చిత్తూరు జిల్లా వాస్తవ్యులు సురభి నరసింహమూర్తి, అనురాధ దంపతులు 25 వేల రూపాయలను చెక్ రూపంలో కార్యాలయ సిబ్బందికి అందజేశారు. అనంతరం దాతలకు దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.