మన్యం: సితానగరం మండలం జోగింపేటలో గల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిర్వాహకులు పెడుతున్న ఆహారం సరిగా లేకపోవడం పట్ల ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గురుకులంలో పర్యటించిన ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అన్నంలో పురుగులు ఉండటంతో నిర్వాహకులపై మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.