ATP: కళ్యాణదుర్గం పట్టణం పార్వతినగర్లోని టీచర్ రాజేంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. 20 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ. 20,000 నగదు మాయమైనట్లు సమాచారం. ఇంట్లో ఇద్దరూ ఉపాధ్యాయులుగా విధుల్లో ఉండటంతో ఈ ఘటన జరిగింది. సంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల దర్యాప్తు కొనసాగుతోంది.