SRCL: ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన నూతన రేషన్ కార్డులను రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సురేశ్, మండల అభివృద్ధి అధికారి లచ్చాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.