NLR: మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వస్తాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.