SRCL: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై రాహుల్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. 7,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.