కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ (Kerala Assembly) ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) ఆమోదించింది. ఇందులో ఎలాంటి సవరణలు సూచించలేదు. అనంతరం స్పీకర్ శ్యాంసీర్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. తీర్మానాన్ని సమర్పిస్తూ..రాష్ట్రాన్ని మలయాళంలో ‘కేరళం (Keralm)’ అని పిలిచేవారని, ఇతర భాషల్లో ఇప్పటికీ కేరళ అంటున్నారని సీఎం విజయన్ అన్నారు. మలయళం (Malayalam) మాట్లాడే వారి కోసం ఐక్యకేరళను ఏర్పాటు చేయాల్సిన అవసరం జాతీయ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి బలంగా ఉందన్నారు.
రాష్ట్రం పేరును పూర్వం నుండే మలయాళంలో కేరళం అని పిలిచేవారని, కానీ ఇతర భాషల్లో కేరళ అంటున్నారన్నారు. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో తమ రాష్ట్రం పేరును కేరళ అని రాశారని, దీనిని కేరళంగా సవరించాలన్నారు. మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్రర పోరాట కాలం నుంచే ఉందని వివరించారు. ‘రాజ్యాంగం Constitution) లోని మొదటి షెడ్యూల్లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 (Article 3) ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోందని’ సీఎం విజయన్ అన్నారు.