సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) అరుదైన ఘనత సాధించారు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిప్టు ఇచ్చారు. ఒక నక్షత్రానికి (Star) ఆయన పేరును రిజిస్టర్ చేయించారు. ఈ విషయాన్ని స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు RA:12H33M29S నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టారు.గెలాక్సీ(Galaxy)లో అత్యంత ప్రేమగా ఇష్టపడే నక్షత్రం ఇదేనంటూ వారు తెలిపారు. మహేశ్ ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్కాట్లాండ్
(Scotland) టూర్‌కు వెళ్లారు.
బుధవారం ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. మహేశ్ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలంటూ చిరంజీవి(Chiranjeevi), ఎన్టీఆర్, హరీశ్ శంకర్, తమన్, విజయ్ దేవరకొండ.. తదితరులు పోస్టులు పెట్టారు.ఇక, మూవీల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘గుంటూరు కారం’(Guntur Caram) లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయిక. తమన్ స్వరాలు అందిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.