»Hardoi District Up The Villagers Climbed The Water Tank Could Not Bear The Pain Of Flies
Viral News: మీ ఉర్లో ఈగలెక్కువ, పిల్లను ఇవ్వలేం..గ్రామస్తుల నిరసన
ఓ గ్రామంలో ఈగల బెడద విపరీతంగా ఉంది. ఎంతలా అంటే వాటికి భయపడి ఆ ఊరి వారికి పిల్లను కూడా ఇస్తలేరట. దీంతో అనేక మంది ఆ గ్రామం వదిలిపెట్టి వలస కూడా పోతున్నారని తెలుస్తోంది. దీంతో పలువురు వారి ఆవేదన గురించి తెలిపిందుకు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
Hardoi district UP, the villagers climbed the water tank, could not bear the pain of flies
Viral News: మాములుగా ఎవరన్నా వాటర్ ట్యాంక్(Water Tank) ఎక్కి నిరసన తెలుపుతున్నారంటే ఏ ఫ్యామిలీ గొవడలో, ప్రేమ వ్యవహారమో అనుకుంటాము. ఇలా నిరసనలు తెలిపిన చాలా రకాల ఘటనలు చూసింటాము. కానీ ఇది కాస్త వినుత్నమైనది. అదేంటంటే ఈగల(flies) బాధ భరించలేక గ్రామంలోని కొందరు యువకులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలియజేశారు. చూడడానికి ఫన్నీగా కనిపిస్తుంది కదా. కానీ ఈ సమస్య లోతు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఘటన యూపీలో(Uttar Pradesh) చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని కుయ్య గ్రామంలో గత కొంత కాలంగా ఈగ(Flies)ల సమస్య ఆందోళనకరంగా మారింది. దీనికి కారణం వారి గ్రామంలో ఉన్న పౌల్ట్రి ఫామ్. ఈ కారణంగా ఈగల బెడద తీవ్రస్థాయికి పెరిగి గ్రామస్థుల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయట పడటానికి 24 గంటలు దోమల తెరలను వాడాల్సి వస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో గ్రామంలో పెళ్లిళ్లు కూడా జరగడం లేదంటే అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు గ్రామంలోని మహిళలు వేరే ఊర్లకు వలస వెళ్తున్నారు. ఇక బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. ఈ సమస్యపై చాలా సార్లు అధికారులకు చెప్పామని అయినా ఎవరు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యను తెలియజేయడానికి ఏడుగురు గ్రామస్థులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని కిందికి దించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ సమస్య తీర్చుతామని చెప్పడంతో వారు కిందకు దిగారు. అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. చివరికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి:Rahul gandhi: మీరు దేశ వ్యతిరేకులు, భారతమాతను చంపేశారు